Header Banner

ఏపీలో టీచర్ల బదిలీలు! వీరికి తప్పనిసరి, వారికి మినహాయింపు!

  Mon May 12, 2025 11:15        Politics

ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీకి రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ప్రణాళికలు రూపొందించింది. ఉపాధ్యాయ సంఘాలతో చర్చల తరువాత మార్గదర్శకాలకు తుది రూపం ఇచ్చింది. ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సర్వీసుకు ప్రామాణిక తేదీగా మే 31ని నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో అంధ టీచర్లకు బదిలీల నుంచి మినహాయించారు. కాగా, పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీల ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయనుంది.



తుది కసరత్తు

ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలు .. పదోన్నతుల నిర్వహణకు వీలుగా తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి మొదలు పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీల ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. రాష్ట్రంలో బదిలీల చట్టం ప్రకారం మొదటిసారి ఈ ప్రాసెస్ నిర్వహించనున్నారు. ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ కొంతమంది అంధ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్‌కో విధించింది. దీంతో అంధ ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించిన బదిలీలను మినహాయించి, మిగతా వాటికి ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆప్షన్స్ పెట్టుకునేందుకు మాత్రం వారికి అవకాశం కల్పిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! సచివాలయ ఉద్యోగులకు శాఖల కేటాయింపు..

 

మార్గదర్శకాలు

బదిలీల్లో భాగంగా మొదట ప్రధానోపాధ్యాయులను బదిలీ చేయనున్నారు. దాంతో ఖాళీ అయిన స్థానాలు, కొత్తగా అవసరమయ్యే వాటిల్లో స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రమోషన్లు కల్పిస్తారు. తర్వాత మిగతా ప్రక్రియ ఉంటుంది. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల అవసరాల మేరకు సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పదోన్నతులు కల్పిస్తారు. కాకపోతే స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల అవసరం చాలా తక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఎస్జీటీలకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పదోన్న తులు కల్పిస్తారు. కొంతమంది సబ్జెక్టు టీచర్లకూ ఆదర్శ పాఠశాలల హెచ్‌ఎంలుగా అవకాశం ఇవ్వ నున్నారు. బదిలీలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. మే 31వ తేదీ నాటికి 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, అయిదేళ్ల సర్వీసు పూర్తయిన హెచ్‌ఎంలను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.

వీరికి మినహాయింపు

మే 31వ తేదీ నాటికి 2 సంవత్సరాల సర్వీసు మాత్రమే ఉండే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులకు బదిలీల నుంచి మినహాయించారు. కావాలనుకుంటే వారూ దరఖాస్తు చేసుకునేలా వెసు లుబాటు కల్పించారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్​ను విద్యాశాఖ సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన GO-117కు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేశారు. గరిష్ఠ సర్వీసు పూర్తయి బదిలీల్లో స్టేషన్ల ఎంపికకు ఆప్షన్స్ ఇవ్వకపోతే ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన స్థానాలకు బదిలీ చేస్తారు. అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటారు. ఆదర్శ పాఠశాలలకు ఈ చట్టం నుంచి మినహాయించారు.


ఇది కూడా చదవండి: వారికి శుభవార్త.. ఇంక నుండి ఆస్తి పన్ను ఉండదు! పవన్ సంచలన నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

ఏపీలో కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా! కీలక అప్‌డేట్!

 

భారత్ తో యుద్ధం చేసే సత్తా పాక్కు లేదు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

మోదీ సంచలన ప్రకటన! పీఓకే పాక్ అప్పగించాల్సిందే, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు 

మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #APTeachersTransfers #TeacherTransfers2025 #APEducationDept #TeachersPromotion #TransfersGuidelines #APGovtUpdates #SchoolEducationAP